అష్టలక్ష్మీ స్తోత్రం Ashtalakshmi Stotram Telugu Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం Ashtalakshmi Stotram Telugu Lyrics - అష్టలక్ష్మీస్తోత్రం starting with lyrics సుమనస వందిత సుందరి మాధవి. Ashta Lakshmi stotram is a popular Hindu devotional song addressed to the eight forms of Goddess Lakshmi. The eight stanzas of this stotram describe and praise the Ashtalakshmi forms -  Dhanya Lakshmi, Dhairya Lakshmi, Gaja Lakshmi, Santana Lakshmi, Vijaya Lakshmi, Vidya Lakshmi, Dhana Lakshmi. 

Dont forget to watch Ashtalakshmi Stotram Video Song by Sulamangalam Sisters after the lyrics. 

Ashtalakshmi Stotram Telugu Lyrics

| ఆదిలక్ష్మీ ||
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ ||

|| ధాన్యలక్ష్మీ ||
అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ ||

|| ధైర్యలక్ష్మీ ||
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ ||

|| గజలక్ష్మీ ||
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ ||

www hindu devotional blog com

|| సంతానలక్ష్మీ ||
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || ౫ ||

అష్టలక్ష్మీ స్తోత్రం Ashtalakshmi Stotram Telugu Lyrics

|| విజయలక్ష్మీ ||
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్య పదే |
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ ||

|| విద్యాలక్ష్మీ ||
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ ||

hindu devotional blog

|| ధనలక్ష్మీ ||
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ ||

Ashtalakshmi Stotram Video Song



Comments

Search Hindu Devotional Topics

Contact Hindu Devotional Blog

Name

Email *

Message *